Saturday, November 15, 2025
HomeఆటPakistan: వరస్ట్ ఫీల్డింగ్.. పాక్ ఖాతాలో మరో చెత్త రికార్డు..!

Pakistan: వరస్ట్ ఫీల్డింగ్.. పాక్ ఖాతాలో మరో చెత్త రికార్డు..!

Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి పాతాళానికి చేరుకుంది. దాయాది జట్టు మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. అన్ని జట్లతో పోల్చితే.. అత్యంత చెత్త ఫీల్డింగ్‌ చేస్తున్న టీమ్‌గా నమోదైంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ట్రైసిరీస్‌లో అఫ్గాన్‌పై పాకిస్థాన్‌ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ఫీల్డింగ్‌ కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకుంది. అయితే.. ఫీల్డింగ్‌లో ఇలాంటి ప్రదర్శన ఆ జట్టుకు కొత్తమీ కాదు.  ‘క్రిక్‌బజ్‌’ గణాంకాల ప్రకారం.. 2024 నుంచి పాకిస్థాన్‌ జట్టు మొత్తం 48 క్యాచ్‌లు, 98 రనౌట్స్‌ను మిస్‌ చేసుకుంది. ఇక 89 సార్లు మిస్‌ఫీల్డ్‌ చేసింది. క్యాచ్‌లు, రనౌట్స్‌ పరంగా చూస్తే.. 41 జట్లతో పోల్చితే పాక్‌ అత్యంత చెత్త జట్టుగా అగ్రస్థానంలో ఉంది. ఇక మిస్‌ఫీల్డ్‌ల పరంగా వెస్టిండీస్‌ (90) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో పాకిస్థాన్‌ క్యాచింగ్‌ సామర్థ్యం.. 12 పూర్తిస్థాయి జట్లలో 81.4%తో 8వ స్థానంలో ఉంది. ఈ గణంకాలే ఆ జట్టు ఫీల్డింగ్‌లో ఎంత దారుణంగా ఉందో చెబుతున్నాయి.

- Advertisement -

Read Also:  Revanth: పేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన రేవంత్

పాక్ పేసర్ విమర్శలు

ఇక ఇటీవల జట్టు ఫీల్డింగ్‌ సమస్యలపై తనను ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధిని పాక్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ తీవ్రంగా విమర్శించాడు. ‘‘మీరు మ్యాచ్‌ను సరిగ్గా చూడటం లేదు. ఫీల్డింగ్‌లో మేం తప్పులు చేయడం లేదు. మీరు మళ్లీ సమీక్షిస్తే.. మా ఆట తీరు బాగుందంటారు’’ అంటూ ఎదురుదాడికి దిగాడు.

Read Also: Air India: వరుస ఆఫర్లను ప్రకటిస్తున్న ఎయిరిండియా..!

పాక్ కు అఫ్గాన్ షాక్..

ఇకపోతే, ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అఫ్గానిస్థాన్ భారీ షాక్ ఇచ్చింది. ఆసియాకప్‌కు మంచి సన్నాహకంగా ఉపయోగపడుతుందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు అఫ్గానిస్థాన్, యూఏఈలతో కలిసి ట్రై సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచులలో ఒక దాంట్లో అఫ్గాన్, రెండో మ్యాచులో యూఏఈని ఓడించిన పాక్.. మూడో మ్యాచులో పరాజయం పాలైంది. షార్జా వేదికగా మంగళవారం జరిగిన మ్యాచులో అఫ్గాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సెద్దిఖుల్లా అటల్ (45 బంతుల్లో 64 రన్స్), ఇబ్రహీం జద్రాన్ (45 బంతుల్లో 65 రన్స్) సత్తాచాటారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్ 4 వికెట్లు, సైయిమ్ ఆయుబ్ 1 వికెట్ తీశారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. అఫ్గాన్ స్పిన్ వలలో చిక్కుకుంది. ఈ మ్యాచులో ఏకంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగిన ఆ జట్టు.. ప్లాన్ వర్కౌట్ చేసింది. స్పిన్ త్రయం రషీద్ ఖాన్ , మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ దెబ్బకు పాకిస్థాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. దీంతో 111 పరుగులకే ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పేసర్ హరీస్ రవూఫ్.. బ్యాట్ ఝుళిపించి పాక్ పరువు కాపాడాడు. 16 బంతుల్లో 34 రన్స్ చేసిన ఈ ప్లేయర్.. పాక్ తరఫున ఈ మ్యాచులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. చివరకు పాక్ 9 వికెట్ల నష్టానికి 151 రన్స్‌కి పరిమితమైంది. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అఫ్గాన్.. అగ్రస్థానంలోకి చేరింది. పాక్, అఫ్గా‌న్‌లు తమ తర్వాతి మ్యాచులో యూఏఈతో తలపడనున్నాయి. సెప్టెంబర్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad