Asia Cup: ఈ ఆసియాకప్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక ఈసారి ఆసియా కప్ లో మూడోసారి భారత్, పాక్ సమరాన్ని చూడబోతున్నాం. గురువారం బంగ్లాదేశ్‌తో నిర్ణయాత్మక సూపర్ 4 మ్యాచ్‌లో బ్యాటుతో తడబడ్డప్పటికీ అద్భుత బౌలింగ్‌తో పాక్ గట్టెక్కింది. 11 పరుగుల తేడాతో నెగ్గింది. 136 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. షహీన్ షా అఫ్రిది (3/17), రవూఫ్ (3/33) సైమ్ అయూబ్ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాను దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఎమాన్ (0) వికెట్‌ను కోల్పోయిన బంగ్లా ఆ తర్వాత ఏ దశలోనూ నిలదొక్కుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. షమిమ్ (30; 25 బంతుల్లో 2×6) ఒంటరి పోరాటం చేసినా బంగ్లా గెలుపునకు సరిపోలేదు.
Read Also: Suryakumar Yadav: సూర్యకుమార్ కు ఐసీసీ వార్నింగ్.. జరిమానా లేదా డీమెరిట్..?
పోరాడిన పాక్..
ఇకపోతే, అంతకుముందు పాకిస్థాన్ కూడా బ్యాటుతో కష్టపడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 8 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. ఆ జట్టు ఏ దశలోనూ జోరందుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. పాకిస్థాన్ 135 పరుగులు చేయడం కూడా గొప్పే. ఎందుకంటే ఆ జట్టు ఓ దశలో 49కే 5 వికెట్లు కోల్పోయింది. అలాంటి సమయంలో పాక్‌ను హారిస్ (31; 23 బంతుల్లో 2×4, 1×6) ఆదుకున్నాడు. షహీన్ షా అఫ్రిది (19)తో ఆరో వికెట్‌కు 22, నవాజ్ (25; 15 బంతుల్లో 1×4, 2×6)తో ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. అష్రాఫ్ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ (3/28), రిషాద్ హొస్సేన్ (2/18), మెహదీ హసన్ (2/28) పాక్ పతనాన్ని శాసించారు. ఇకపోతే, ఆసియాకప్ ఫైనల్ ఆదివారం జరుగుతుంది.
Read Also: Womens World Cup: వారంలోగా వన్డే ప్రపంచకప్.. భారత జట్టుకు బిగ్ షాక్..!
స్కోర్లు..
పాకిస్థాన్: 135/8 (హారిస్ 31, నవాజ్ 25, షహీన్ అఫ్రిది 19, సల్మాన్ ఆఘా 19; తస్కిన్ 3/28, రిషాద్ 2/18, మెహదీ హసన్ 2/28);
బంగ్లాదేశ్: 124/9 (షమిమ్ 30, సైఫ్ 18, నురుల్ 16, రిషాద్ 16; షహీన్ అఫ్రిది 3/17, రవూఫ్ 3/33; సైమ్ అయూబ్ 2/16).


