Saturday, November 15, 2025
HomeఆటIND vs PAK Asia Cup 2025: టాస్‌ ఓడిన భారత్‌.. ఇరు జట్ల తుది...

IND vs PAK Asia Cup 2025: టాస్‌ ఓడిన భారత్‌.. ఇరు జట్ల తుది జాబితా ఇదే.!

IND vs PAK Asia Cup 2025: ఆసియా కప్‌ 2025లో భాగంగా ఇండియా- పాకిస్థాన్‌ మ్యాచ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ వేదికగా ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ బౌలింగ్‌ చేయనుంది. మ్యాచ్‌ రద్దు చేయాలనే నిరసనల నడుమ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమైంది. 

- Advertisement -

జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. అక్కడ భారత్ సూపర్-8లో పాకిస్థాన్‌ను ఓడించి ఆ జట్టును ఓడించింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత, ఆసియా కప్ గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించగా.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు దాదాపు సూపర్-4 కి చేరుకుంటుంది.

Also Read: https://teluguprabha.net/sports-news/irfan-pathan-offers-sweeping-verdict-on-jasprit-bumrahs-edge-over-pakistan-batter-i-dont-think-he-stands-a-chance/

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. 

Also Read: https://teluguprabha.net/sports-news/azharuddin-warns-pakistan-ahead-of-asia-cup-clash-bumrah-will-be-too-hot-to-handle/

ఇరు జట్ల తుది జాబితా ఇదే:

పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), సల్మాన్ అఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముఖీమ్.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad