Saturday, November 15, 2025
HomeఆటPat Cummins fires back at Justin Langer : మాజీ కోచ్‌కు టెస్ట్ కెప్టెన్...

Pat Cummins fires back at Justin Langer : మాజీ కోచ్‌కు టెస్ట్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ కౌంట‌ర్‌

Pat Cummins fires back at Justin Langer : ఆస్ట్రేలియా జ‌ట్టు మాజీ కోచ్ జ‌స్టిస్ లాంగ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ షూటుగానే బ‌దులు ఇచ్చాడు. జ‌ట్టులో ఎవ‌రూ పిరికి వాళ్లు లేర‌ని అన్నాడు. వెస్టిండీస్‌తో బుధవారం పెర్త్‌లో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు కమిన్స్ విలేకరులతో మాట్లాడాడు. లాంగ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు నిరుత్సాహానికి గురి చేశాయ‌ని తెలిపాడు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌న్నాడు. “అప్పుడు జ‌రిగిన దాని గురించి ఆలోచించి లాంగ‌ర్ అలా మాట్లాడ‌ని అనుకుంటున్నా. అందుకు కృత‌జ్ఞ‌త‌లు. అయితే.. గ‌త సంవ‌త్స‌రం కాలంగా జ‌ట్టు ఎంతో అద్భుతంగా ఆడుతోంది. మా ఆట తీరు ప‌ట్ల మేము గ‌ర్వంగా ఉన్నాం” అని క‌మిన్స్ అన్నాడు.

- Advertisement -

అప్ప‌ట్లో క‌మిన్స్ కెప్టెన్సీలోని జ‌ట్టు స‌భ్యులే కోచ్ గా లాంగ‌ర్ ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌వ‌ద్ద‌ని బోర్డును కోరారు. అత‌డి కోచింగ్ ప‌ద్ద‌తి స‌రైందిగా తాము బావించ‌డం లేదంటూ తెలిపారు. దీంతో త‌న కోచ్ ప‌ద‌విని పొడిగించుకోవాల‌ని చూసిన లాంగ‌ర్‌కు నిరాశే ఎదురైంది. దీనిపై ఇటీవ‌ల లాంగ‌ర్ మాట్లాడుతూ.. ఆసీస్ క్రికెట‌ర్లు త‌న ముందు బాగుండేవార‌ని, త‌న‌ను కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంలో వారే కీల‌క పాత్ర పోషిస్తార‌ని అనుకోలేదంటూ వ్యాఖ్య‌నించాడు. జ‌ట్టులో కొంద‌రు పిరికివారు ఉన్నారు అని అన‌డం కాస్త వివాదానికి దారి తీశాయి. దీనిపై ప్యాట్ క‌మిన్స్ స్పందించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad