ఈసారి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ఫారమ్‌తో దూసుకెళ్తోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ముందుకెళ్తూ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. ప్లేఆఫ్స్ దగ్గర్లో ఉండటం, జట్టులో ఎనర్జీ పీక్స్‌కి చేరటం అన్నీ కలిసి వచ్చిన వేళ… భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో ఐపీఎల్ కొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు తిరిగి ప్రారంభం కానున్న సమయంలో.. ఒక్క వార్త ఆర్సీబీ అభిమానుల్లో టెన్షన్ పెడుతోంది.
రాబోయే మ్యాచ్‌లకు కెప్టెన్ రజత్ పాటిదార్ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడంలేదు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డ సంగతి తెలిసిందే. వేలికి బలమైన గాయం తగలడంతో డాక్టర్లు స్ప్లింట్ వేసేందుకు సూచించారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడేలా ఉందని తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లలో కూడా బ్యాట్ పట్టే పరిస్థితి లేదని సమాచారం. రజత్ గాయం ఇండియా ‘ఏ’ జట్టులో స్థానం కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే IPLలో మిగిలిన మ్యాచ్‌లు ఆడడం కష్టమే అని చెప్పొచ్చు.
ఇదే సమయంలో, ఇప్పటికే దేవ్‌దత్ పడిక్కల్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వగా అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయం కారణంగా IPL 2025 సీజన్ మిగిలిన భాగానికి దూరమవనున్నాడు. ఇప్పుడు రజత్ పాటిదార్ కూడా మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉంటే, ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బే. తాజా సమాచారం ప్రకారం, వికెట్ కీపర్ జితేశ్ శర్మ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే 11 మ్యాచులలో 8 విజయాలతో, 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ… ఈ ఆటగాళ్ల గైర్హాజరీతో తమ విన్నింగ్ మోమెంటమ్‌ను కొనసాగించగలదా? అభిమానులు ఇప్పుడు అదే ప్రశ్నతో కంగారు పడుతున్నారు.