Saturday, October 12, 2024
HomeఆటPink Power Run 2024: మహిళా ఆరోగ్యం మా ప్రాధాన్యత: సీఎం రేవంత్

Pink Power Run 2024: మహిళా ఆరోగ్యం మా ప్రాధాన్యత: సీఎం రేవంత్

బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..

పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను గర్వంగా చెబుతున్నానని సీఎం రేవంత్ అన్నారు. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని మేం బలంగా నమ్ముతున్నామన్నారు.

- Advertisement -

మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్ లో మహిళలు ఒంటరిగా సవాళ్లను అధిగమించేలా చేస్తుందని, దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దామన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు రేవంత్. మనమంతా కలిసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News