Saturday, November 23, 2024
HomeఆటPlaying: ఇంటి ఆటలతో బంధాలు బలీనం...

Playing: ఇంటి ఆటలతో బంధాలు బలీనం…

ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ జోష్ వెల్లివిరుస్తోంది. ఈ టైములో ఎక్కడెక్కడి కుటుంబ సభ్యులు, చుట్టాలు, పిల్లలు అందరూ ఒక చోట చేరతారు. అప్పుడు ఇల్లంతా సందడే సందడి. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆడే ఫ్యామిలీ గేమ్స్ పండుగకు మరింత వన్నె తెస్తాయి. పండుగ వేళల్లోనే కాదు సాధారణ సమయాల్లో కూడా వారాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బాగా బలపడేట్టు ఫ్యామిలీ గేమ్స్ సహకరిస్తాయి. అలాంటి ఫ్యామిలీ ఫన్ గేమ్స్ కొన్ని ఉన్నాయి.

- Advertisement -

వాటిల్లో ఒకటి మోనోపలి. ఇది బోర్డు గేమ్. కొనుగోళ్లు, ఆస్తుల ట్రేడింగ్ వంటివాటితో పాటు మనీ నిర్వహణా ట్రిక్స్, నెగోషియేషన్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలు ఈ ఆటలో ఉంటాయి. డబ్బును విచక్షణతో ఖర్చుపెట్టడం ఎలాగో ఈ ఆట నేర్పుతుంది. ఈ ఆట ఆడేటప్పుడు ఈ విషయాలన్నింటినీ పిల్లలు తెలుసుకుంటారు. వీటితోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర లైఫ్ స్కిల్స్ ను కూడా పిల్లలు పెంచుకుంటారు. ఆట సైతం పసందుగా ఉంటుంది. ఈ ఆట ఎంతో ఫన్ తో నిండి ఉండి కుటుంబ సభ్యులు, బంధువుల మనసుల్లో మధురమైన జ్ఘాపకాలుగా శాశ్వతంగా మిగులుతాయి.

క్లూడో ఇంకో ఫ్యామిలీ గేమ్. ఈ ఆట ఆద్యంతం మిస్టరీలతో, క్లూస్ తో నిండి ఉండి ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతేకాదు ఈ ఆటలో ఫన్ కూడా బాగా ఉంటుంది. ఈ ఆటలో మిస్టరీని ఛేదించాలి. అది మజాగా ఉంటుంది. ఆటలో ఆ మిస్టరీని ఛేదించినపుడు మీ కేకలతో, అరుపులతో ఇల్లు దద్దరిల్లిపోతుంది. పెద్దా, చిన్నా జోష్ తో ఇల్లంతా ఎంతో సందడిగా మారిపోతుంది. కుటుంబసభ్యులందరూ కలిసి అనుభవించిన ఆ ఆనంద క్షణాలను జీవితంలో అస్సలు మర్చిపోలేరు. ఇచ్చిన క్లూస్ ఆధారంగా సాగే ఈ ఆట వల్ల పిల్లల్లో లాజికల్ , రీజనింగ్ లతో కూడిన ఆలోచనాధోరణి పెరుగుతుంది. చాలామంది కుటుంబసభ్యులు పాల్గొని ఆడే ఆట గేమ్ ఆఫ్ లైఫ్ . ఈ ఆటలో అడుగడుగునా ఆశ్చర్యాలు తటస్థపడుతూ మజాగా సాగుతుంది.

పెద్దవాళ్ల నుంచి పిన్నల దాకా అందరికీ ఈ ఆట ఎంతో ఎంజాయ్ మెంటును ఇస్తుంది. ఈ ఆట ఆడడం వల్ల పిల్లలు తమ కెరీర్ పరంగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవరచుకోగలరు. జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సందర్భాలలో నిర్ణయాలను సులభంగా తీసుకోగలరు. అంతేకాదు అవసరమైతే జీవితంలో సాహసోపేతంగా వ్యవహరించడానికి సైతం వెనుకంజ వేయరు. కనెక్టు 4 అనేది మరో సూపర్ గేమ్. ఇందులో ప్రత్యర్థిని విజయం వైపు వెళ్లకుండా అడుగడుగునా వ్యూహాత్మకంగా అడ్డుకొంటుండాలి. ఈ ఆట పిల్లలకు ఎంతో ఫన్ ను పంచుతుంది.

5 అలైవ్ కార్డ్ గేమ్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండే ఆట. ఎంతో సులువైన ఆట కూడా. ఇంట్లో వాళ్లంతా కలిసి ఈ గేమ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు గాని, ప్రయాణాల్లో గానీ ఈ గేమ్ ను ఆడుకోవచ్చు. ఈ ఆట ఆడేవాళ్లూ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తూ ప్రత్యర్థికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండాలి. అనుక్షణం అడ్డకుంటూ ప్రత్యర్థిని దెబ్బతీయాలి. ఈ ఆటలో థ్రిల్ ఉంటుంది.

ఇవి కాక ఇంట్లో అంతా కలిసి ఆడే మరెన్నో సంప్రదాయ ఆటలు మనకు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కుటుంబసభ్యులతో, బంధువులతో ఆడడాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే కుటుంబ బంధాలు బలపడతాయి. సమాజంలో నలుగురితో కలిసి మెలిసి జీవించగలిగే ఆరోగ్యకరమైన వ్యక్తిత్వంతో పిల్లలు ఎదుగుతారు. అంతేకాదు తమ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయినా తట్టుకుని ఆరోగ్యకరమైన యువతగా నిలబడతారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News