Saturday, November 15, 2025
HomeఆటPM Modi: ‘మా అమ్మకి మీరే హీరో.. మీ స్కిన్‌ కేర్‌ సీక్రెట్‌ ఏంటి.?’- ప్రధాని...

PM Modi: ‘మా అమ్మకి మీరే హీరో.. మీ స్కిన్‌ కేర్‌ సీక్రెట్‌ ఏంటి.?’- ప్రధాని మోదీతో టీమిండియా ఉమెన్‌ చిట్‌ చాట్‌.. 

PM Modi Chit Chat with Indian Women Team: ప్రధాని నరేంద్ర మోదీతో భారత మహిళల క్రికెట్‌ జట్టు చిట్‌ చాట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వారి మధ్య ఆసక్తికర సంభాషణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల, సౌత్‌ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ టీమిండియా ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మోదీ వారితో భేటీ అయింది. ప్రతి ప్లేయర్‌తో ఆయన సంభాషించి వారి వ‌ద్ద నుంచి అనేక విష‌యాల‌ను తెలుసుకున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ind-vs-aus-india-won-by-48-runs/

చిట్‌ చాట్‌ సందర్భంగా మహిళా క్రికెటర్లు మోదీని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇక పేసర్ అరుంధతి రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ వైరల్‌ అవుతోంది. అరుంధతి రెడ్డి తన తల్లి పంపిన ఓ ప్రత్యేక సందేశాన్ని ప్రధానికి వినిపించింది. “మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. మా అమ్మ మీకు పంపిన ఒక సందేశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆమెకు మీరు హీరో అట. మా అమ్మ నాకు 4-5 సార్లు ఫోన్ చేసి, ‘నా హీరోని నువ్వు ఎప్పుడు కలుస్తున్నావు?’ అని పదేపదే అడిగింది.” అని అరుంధతి చెప్పడంతో ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించారు. మోదీతో పాటు అక్కడున్న వారూ ఆయన చిరునవ్వుకి జత కలిపారు. 

ఇక టీమిండియా ఉమెన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ హర్లీన్‌ డియోల్‌ ప్రధాని మోదీని ఓ ఆసక్తికర ప్రశ్న అడగడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ స్కిన్‌ ఎప్పుడూ చాలా గ్లోగా కనిపిస్తుంది. మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏంటి సర్‌..?’ అని హర్లీన్‌ ప్రశ్నించింది. దీంతో ఆ వాతావరణమంతా నవ్వులతో నిండిపోయింది. ఈ ఊహించని ప్రశ్నకు ప్రధాని తొలుత ఆశ్చర్యపోయినా.. తర్వాత ‘నేను వాటి గురించి అంతగా ఆలోచించను’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

Also Read: https://teluguprabha.net/sports-news/betting-apps-case-ed-seize-rs-11-14-crore-worth-assets-of-raina-and-dhawan/

దీనికి వెంటనే జట్టులోని మరో క్రీడాకారిణి.. ‘అది దేశంలోని కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల వల్లే ఆ గ్లో వచ్చింది.’ అని అనడంతో మళ్లీ నవ్వులు విరబూశాయి. ఈ సరదా సంభాషణకి జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ తోడై.. ‘చూశారుగా సార్, ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాలతో నేను కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వస్తోంది. అందుకే నా జుట్టు త్వరగా తెల్లబడింది!” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad