Monday, December 9, 2024
HomeఆటJayasuriya: 17 మ్యాచుల్లోనే 100 వికెట్లు.. రికార్డు సృష్టించిన లంక బౌలర్

Jayasuriya: 17 మ్యాచుల్లోనే 100 వికెట్లు.. రికార్డు సృష్టించిన లంక బౌలర్

Prabath Jayasuriya| టెస్టు క్రికెట్‌లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రెండో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్‌ తీయడంతో 100 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది అతడికి 17వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.

- Advertisement -

టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్‌ ఆల్ఫ్రెడ్ లోమన్‌ పేరిట ఉంది. 1886లో లోమన్‌ కేవలం​ 16 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక టర్నర్‌, బార్నెస్‌, గ్రిమ్మెట్‌, యాసిర్‌ షా కూడా 17 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని అందుకున్నారు.

కాగా డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు నమోదుచేసుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇదే ఆ జట్టుకు అత్యల్ప స్కోర్. ప్రొటీస్ బౌలర్లలో మార్కో జన్సెన్‌ 7 వికెట్లు తీశాడు. కమిందు మెండిస్‌ (13), లహీరు కుమార (10 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం. అంతకుముందు సౌతాఫ్రికా 191 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News