భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను(Khel Ratna Award) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెస్ విభాగంలో డి.గుకేశ్(Gukesh Dommaraju), షూటింగ్ విభాగంలో మను బాకర్(Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh), పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ఈ అవార్డులు అందుకున్నారు.