Pro Kabaddi League season 12: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ఏడు సంవత్సరాల తర్వాత విశాఖపట్నంకు తిరిగి వస్తున్న ఈ లీగ్‌లో.. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్ మరియు తమిళ్ తలైవాస్ తలపడతాయి. బెంగళూరు బుల్స్ మరియు పుణేరి పల్టన్ అదే రోజు రెండవ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు వైజాగ్‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మషల్ స్పోర్ట్స్ బిజినెస్ హెడ్ మరియు ప్రో కబడ్డీ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి, తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్, తమిళ్ తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్, మిగిలిన 10 మంది కెప్టెన్లు, ఆటగాళ్ళు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు కబడ్డీని మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ సీజన్ ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నట్లు అనుపమ్ గోస్వామి అన్నారు. లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ సీజన్ టిక్కెట్లు అధికారిక ప్లాట్‌ఫామ్ ‘జోమాటో డిస్ట్రిక్ట్’లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు.
Also read: Asia Cup 2025 -ఆసియా కప్ కు స్క్వాడ్స్ ను ప్రకటించిన జట్లు ఇవే..!
ముందుగా పీకేఎల్ నిర్వాహకులు వీరోచితంగా పోరాడి మరణించిన వీర జవాన్లుకు నివాళులు అర్పించారు. 1971 ఇండో-పాక్ యుద్ధానికి గుర్తుగా నిలిచిన ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామిని 12 మంది కెప్టెన్లు సందర్శించారు. పీకేఎల్ 12వ సీజన్ మొదటి దశ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 11 వరకు విశాఖపట్నంలో జరుగుతుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌లు జైపూర్, చెన్నై మరియు న్యూఢిల్లీలలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.


