ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో నెగ్గింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు మాత్రమే చేసింది. సాయి సుదర్శన్ (74) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాస్ బట్లర్ (54) రాణించాడు. శుబ్ మన్ గిల్ (33), రూథర్ ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించారు. అయినప్పటికీ డెత్ ఓవర్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది.
అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 చేసింది. చివరి 10 ఓవర్లలో పంజాబ్ ప్లేయర్స్ భారీగా పరుగులు రాబట్టడంతో స్కోర్ సునాయాసంగా 200 దాటింది. కాగా పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు.
97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంష్ ఆర్యా 47, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 5, అహ్మతుల్లా 16, గ్లాన్ మ్యాక్స్‌వెల్ 0, స్టోయినిస్ 20, శశాంక్ సింగ్ 44 (నాటౌట్) పరుగులు తీశారు. దీంతో భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో రవిశ్రీనివాస్ సాయి కిశోర్ 3, రషీద్ ఖాన్, రబాడా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.