HomeTop StoriesPBKS VS LSG: సెంచరీతో ‘శ్రేయస్‌’ విధ్వంసం.. పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

PBKS VS LSG: సెంచరీతో ‘శ్రేయస్‌’ విధ్వంసం.. పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

PBKS VS LSG IPL 2026: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరించింది. వరుసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్‌ ఆశలను సంక్లిష్టం చేసుకున్న శ్రేయస్‌ సేన ఈ రోజు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్‌ సెంచరీతో మ్యాచ్‌ను అజేయంగా ముగించాడు. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి చేరుకుంది. లక్నో టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/delhi-hc-allows-vinesh-phogat-to-participate-in-asian-games-selection-trials/

తొలుత టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. రిషబ్‌ పంత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరును చేసింది. కాగా, లక్నోకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి డకౌట్‌తో వెనుదిరగగా.. నికోలస్‌ పూరన్‌ రెండే పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మరో ఓపెనర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ 72(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆయుష్‌ బదోనీ (43), అబ్దుల్‌ సమద్‌ (37 నాటౌట్‌) జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. రిషభ్‌ పంత్‌(26) పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, మార్కో యాన్సెన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా, అజ్మతుల్లా, శశాంక్‌ సింగ్‌కి చెరో వికెట్‌ దక్కింది. 

Also Read: https://teluguprabha.net/telangana/minister-jupally-meet-on-tourism-sector-development/

197 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన పంజాబ్‌ కింగ్స్‌.. పవర్‌ప్లేలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య డకౌట్‌గా వెనుదిరగగా, కూపర్‌ కనోలీ (18) పరుగులు చేసి వెనుదిరిగాడు. జట్టు ఒత్తిడిలో ఉండగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమయ్యారు. ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రభ్‌సిమ్రన్‌ 69(39బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో శ్రేయస్‌కి సరైన తోడ్పాటు అందించాడు. శ్రేయస్‌ 101(51బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. సూర్యాంశ్‌ షెడ్గే 9(నాటౌట్‌) పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మహమ్మద్‌ షమీ 2 వికెట్లు తీయగా, అర్జున్‌ టెండూల్కర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.   

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News