Saturday, November 15, 2025
HomeఆటPV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింధు దంపతులు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింధు దంపతులు

ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) భర్త వెంకటసాయి దత్తతో కలిసి తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో సంప్రదాయ దుస్తుల్లో స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సింధు దంపతులకు మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

కాగా పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో సాయి-సింధు ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో ఉన్న రఫల్స్‌ హోటల్‌లో ఈ వేడుక జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad