భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu) నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆమె చిన్ననాటి స్నేహితుడు వెంకట దత్తసాయితో ఎంగేజ్‌మెంట్ రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనే క్యాప్షన్ జతచేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వీరి పెళ్లి ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈమేరకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
కాగా సింధును చేసుకోబోయే వెంకట దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో డేటా సైన్స్ చదివారు. ఆయన తండ్రి హైడరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఇటీవల మరో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వివాహం జరిగన సంగతి తెలిసిందే.