PV Sindhu| భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. ఈమేరకు సింధు తండ్రి పీవీ రమణ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభం కానున్నాయి.
జనవరి నుంచి సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెల 22న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సీజన్ సింధుకు చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి బాగా తెలుసని ఆయన వెల్లడించారు. కాగా సింధును చేసుకోబోయే వ్యక్తి వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో డేటా సైన్స్ చదివారు. ఆయన తండ్రి హైడరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఇటీవల మరో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వివాహం జరిగన విషయం విధితమే.