Saturday, October 12, 2024
HomeఆటQuthbullapur: సత్తా చాటిన మహాత్మ జ్యోతిభాపూలే బాలుర పాఠశాల విద్యార్థులు

Quthbullapur: సత్తా చాటిన మహాత్మ జ్యోతిభాపూలే బాలుర పాఠశాల విద్యార్థులు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో..

మహాత్మ జ్యోతిభాపూలే బాలుర పాఠశాల విద్యార్థులు స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో తమ ప్రతిభను చాటి విజయకేతనం ఎగురవేశారని పాఠశాల ప్రిన్సిపల్ కె. వెంకట్రావ్ తెలిపారు. ఈ నెల 25,26,27 వ తేదీలలో హైదరాబాద్ లోనీ స్వామీ వివేకానంద స్కూల్లో జరిగిన అండర్-17 విభాగంలో కబడ్డీ మరియు ఖో ఖో లలో ప్రథమ స్థానం, అండర్ -14 లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు.

- Advertisement -

మణికంఠ, డిస్కస్ త్రో, ప్రవీణ్, యు.గణేష్ 3 కి.మి. అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కి హేమంత్, హరీశ్, రామకృష్ణ ,శ్రీకాంత్, హరికృష్ణ, నవీన్, జయరాంలు సెలెక్ట్ అయ్యారు. వీరిని పాఠశాల ప్రిన్సిపల్ కె.వెంకట్రావ్, ఏటిపి శ్వేత, లక్ష్మి, పిఈటీ సతీష్,హేమంత్, ఉపాద్యాయుల బృందం అభినందించారు. అలాగే జరగబోయే రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News