Saturday, November 15, 2025
HomeఆటRahul Dravid: షాకింగ్.. రాజస్థాన్ రాయల్స్‌కు ద్రావిడ్ గుడ్ బై

Rahul Dravid: షాకింగ్.. రాజస్థాన్ రాయల్స్‌కు ద్రావిడ్ గుడ్ బై

Rahul Dravid Steps Down As Rajasthan Royals Coach: రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు తమ హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ తప్పుకోబోతున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జట్టు నిర్మాణంలో సమూల మార్పుల కోసం రివ్యూ నిర్వహించిన ఫ్రాంచైజీ, ద్రావిడ్‌కు మరింత పెద్ద బాధ్యతలను ఆఫర్ చేసినా, ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. ద్రావిడ్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో, ఐపీఎల్ 2026కి జట్టు భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది.

- Advertisement -

“గత కొన్ని సంవత్సరాలుగా రాయల్స్‌ ప్రయాణంలో రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం ఒక తరాన్ని ప్రభావితం చేసింది. జట్టులో బలమైన విలువలను, గొప్ప సంస్కృతిని నిర్మించారు. ఫ్రాంచైజీ తరపున, ఆటగాళ్ళ తరపున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల తరపున రాహుల్ అందించిన సేవలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఫ్రాంచైజీ తమ ప్రకటనలో పేర్కొంది.

ALSO READ: Duleep Trophy 2025: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన జమ్మూ బౌలర్..

గతేడాది సెప్టెంబర్‌లో ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా తిరిగి రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు హెడ్ కోచ్‌గా విజయం సాధించిన తర్వాత, ద్రావిడ్ తిరిగి రాజస్థాన్‌కు రావడం, 2008లో తొలి టైటిల్ గెలిచిన ఆ జట్టుకు మళ్లీ కప్పు తీసుకువస్తాడని అంతా ఆశించారు. కానీ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ ప్రయాణం నిరాశపరిచింది. 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.

రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే ఆడటం, ఆ సమయంలో రియాన్ పరాగ్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించడం జట్టుకు మరో ఎదురుదెబ్బ. ఇప్పుడు ఏడాది కూడా పూర్తి కాకుండానే ద్రావిడ్ జట్టును వీడటంతో, 2026 ఐపీఎల్ కోసం కొత్త కోచ్‌ను, కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి రాజస్థాన్‌కు ఏర్పడింది.

ALSO READ: Virat Kohli Asia Cup Record: ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ అజేయ రికార్డు.. 13 ఏళ్లుగా ఎవరూ దాటలేని 183 పరుగులు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad