RR vs LSG IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈ రోజు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోరులో రాజస్థాన్ జట్టు అద్భుత విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ గెలుపును ఖాయం చేశాడు. లక్నోపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/record-views-for-peddhi-trailer/
సొంత గడ్డపై టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా లక్నో బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసింది. ఆ స్కోరును కాపాడుకోవడంలో లక్నో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ను పడగొట్టడంలో ఆలస్యం చేయడంతో లక్నో మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. ఎల్‌ఎస్‌జీ బ్యాటర్లలో జాష్ ఇంగ్లిస్ 60(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ 96(57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రిషబ్ పంత్ (35), నికోలస్ పూరన్(16) పరుగులు చేశారు. ఆర్‌ఆర్ బౌలర్లలో యష్ పంజా 2, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/severe-heatwaves-in-the-state-for-two-days/
221 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్ 43(23 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్), ధ్రువ్ జురైల్ 53(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇక వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. అందులో 7 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. వీరి ఇన్నింగ్స్‌తోనే రాజస్థాన్ గెలుపు ఖాయమైంది. చివర్లో వచ్చిన ప్రెటోరియస్(7), ఫెరేరా(16) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్, మోహ్సిన్ ఖాన్‌కి చెరో వికెట్‌దక్కింది.

