HomeTop StoriesRR vs MI: ప్లే ఆఫ్స్‌కి రాజస్థాన్‌.. ముంబైపై ఘన విజయం

RR vs MI: ప్లే ఆఫ్స్‌కి రాజస్థాన్‌.. ముంబైపై ఘన విజయం

RR VS MI IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించి క్వాలిఫైయర్స్‌లో చోటు దక్కించుకుంది. ప్లే ఆఫ్స్‌ కోసం పోరులో ఆర్‌ఆర్‌ జట్టు పోరాడి గెలిచింది. ముంబైపై 30 పరుగుల తేడాతో గెలిచి మెరుగైన రన్‌ రేట్‌తో నాలుగో స్థానానికి చేరింది. రాజస్థాన్‌ గెలుపుతో పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం జరుగుతున్న ఢిల్లీ, కేకేఆర్‌ మ్యాచ్‌ నామమాత్రంగా మారింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/diving-into-the-river-for-alchippa/

మొదట టాస్‌ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్‌ ఎంచుకోగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌కి దిగింది. విధ్వంసకర ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ సారి నిరాశపరిచినా.. మిగతా బ్యాటర్లు తమ వంతు కృషి చేశారు. కాగా, ఏ బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. యశస్వి జైస్వాల్‌(27), ధ్రువ్‌ జురెల్‌(38), రియాన్‌ పరాగ్‌(14), శనక(29), ఫెరీరా(18), జోఫ్రా ఆర్చర్‌(32) పరుగులతో రాణించారు. రవీంద్ర జడేజా(19), నాంద్రే బర్గర్‌(10) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో 2 వికెట్లు తీయగా, విల్‌ జాక్స్‌, ఘజన్‌ఫర్‌, కార్బిన్‌ బాష్‌కి తలో వికెట్‌ దక్కింది. 

Also Read: https://teluguprabha.net/cinema-news/nandamuri-balakrishna-comments-on-film-industry/

ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. ఇటు లక్ష్య ఛేదనలో తడబడింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్‌ పాండ్యా సేన పవర్‌ ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది. స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌గా వెనుదిరాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 60(42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించినప్పటికీ.. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ముంబైకి ఓటమి తప్పలేదు. విల్‌ జాక్స్‌(34), హార్దిక్‌ పాండ్యా(34) మినహా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో ఇన్నింగ్స్‌ పూర్తయ్యేనాటికి 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు తీయగా, నాంద్రే బర్గర్‌, బ్రిజేశ్‌ శర్మ, యశ్‌ పంజా తలో 2 వికెట్లు తీశారు. 

తదుపరి మ్యాచ్‌ ఎలిమినేటర్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్థాన్‌ పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌ 2 ఆడనుంది. క్వాలిఫైయర్‌-1 లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News