HomeTop StoriesE-cigarette: ఐపీఎల్‌లో ఈ-సిగరెట్ కలకలం.. చిక్కుల్లో రియాన్ పరాగ్?

E-cigarette: ఐపీఎల్‌లో ఈ-సిగరెట్ కలకలం.. చిక్కుల్లో రియాన్ పరాగ్?

Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ సరికొత్త వివాదానికి కేంద్రబిందువయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయన ఈ-సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అసలేం జరిగిందంటే?: రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్‌ రూంలో ఉన్న పరాగ్ ఈ-సిగరెట్ తాగినట్లుగా కెమెరా కంటికి చిక్కాడు. సాధారణంగా ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI) నిబంధనల ప్రకారం.. స్టేడియం ప్రాంగణంలో లేదా డ్రెస్సింగ్ రూమ్ పరిధిలో ధూమపానం చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది.

Also read-RR vs PBKS: పంజాబ్‌కి తొలి ఓటమి.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్ సూపర్‌ విక్టరీ

చట్టపరమైన చిక్కులు ఇవే: భారత ప్రభుత్వం 2019 నుంచే ఈ-సిగరెట్లపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ చేసిన పని కేవలం క్రీడా నిబంధనల ఉల్లంఘనే కాకుండా.. దేశ చట్టాలను అతిక్రమించినట్లు కూడా అవుతుంది. అయితే నిబంధనల ఉల్లంఘన రుజువైతే పరాగ్‌పై కఠిన చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం భారీగా పెనాల్టీ పడే అవకాశం ఉంది. అంతేకాదు నిషేధిత వస్తువును వాడినందుకు చట్టపరంగా జైలు శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ ఘటనపై అటు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ.. ఇటు బీసీసీఐ గానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ విచారణలో తప్పు జరిగినట్లు తేలితే పరాగ్ కెరీర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News