ఐపీఎల్ 2025లో మరో హైవోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ రోజుకో మలుపు తిరుగుతున్న ఈ సీజన్‌లో, ఫాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లకు మధ్య జరిగే సమరానికి జైపూర్ వేదిక కానుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచు ప్రారంభం కానుంది. లీగ్ దశ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ పరంగా కీలకం కానుంది.
ముంబై ఇండియన్స్‌కు ఇది తిరిగి లెవెల్‌ను రీచైన చేసుకునే సమయం. సీజన్ ప్రారంభంలో ఓటములతో నలిగిపోయిన ఈ జట్టు, అకస్మాత్తుగా కొత్త జట్టు లా మారిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి ఎగబాకింది. సీనియర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా విజృంభించడంతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే, గుజరాత్‌పై విజయం సాధించి మళ్లీ పోటీకి తిరిగొచ్చారు. ఇప్పటి వరకూ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయినా, తాజా విజయంతో జట్టకు కొత్త ఉత్సాహం వచ్చింది.
ముఖ్యంగా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మీదే చూపు ఉంది. ఈ యువ క్రికెటర్ ఓపెనింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. గుజరాత్‌పై గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వైభవ్.. ఇప్పుడు ముంబై పేసర్లను ఎలా ఎదుర్కొంటాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం ఉన్నా.. ఈ మ్యాచ్‌ను గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలు బాగున్నాయి. జైపూర్ స్టేడియంలో ఆడే హోం మ్యాచ్ కావడం జట్టుకు అదనపు బలాన్నిస్తుంది. IPL చరిత్రను చూస్తే ఈ రెండు జట్లు 31సార్లు పోటీపడ్డాయి. ముంబై 16సార్లు, రాజస్థాన్ 15సార్లు విజయం సాధించాయి. కానీ జైపూర్‌లో మాత్రం రాజస్థాన్ క్లియర్ డామినేషన్ కనబర్చింది. అక్కడ జరిగిన 9 మ్యాచుల్లో 7 విజయాలు రాజస్థాన్ ఖాతాలో పడ్డాయి.
ఈ నేపథ్యంలో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ తో రాజస్థాన్ తీసుకుంటుందా.. లేక ముంబై మరోసారి అద్భుత ప్రతిభ చూపిస్తుందో చూడాలి. ఉత్కంఠకు, అంచనాలకు తావిస్తోన్న ఈ మ్యాచ్ అభిమానులకు మంచి విజువల్ ట్రీట్ కావడం ఖాయం.
రాజస్థాన్ రాయల్స్ అంచనా జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్, హెట్మెయర్, వానిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ/శుభమ్ దుబే.
ముంబై ఇండియన్స్ అంచనా జట్టు: ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా.