ఒక జట్టు మాట తప్పితే.. అక్కడికే ఫుల్‌స్టాప్ పెట్టాలనిపించొచ్చు. కానీ అదే జట్టు తర్వాత అతనే కావాలని ఏరికోరి తీసుకొని.. జట్టు బాధ్యతలు అప్పగిస్తే ఆ కిక్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఈ కథ రజత్ పాటిదార్ ది.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ యువ ఆటగాడు.. గతంలో తాను RCBకి అస్సలు ఆడకూడదని అనుకున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు పాటిదార్‌కు ఆర్‌సీబీ నుంచి ఓ కాల్ వచ్చిందంట. తాము వేలంలో తీసుకుంటామని.. సిద్ధంగా ఉండు అని చెప్పారంట.. దీంతో ఆనందంతో ఊగిపోయిన రజత్.. మళ్లీ ఆర్‌సీబీ జెర్సీలో తళుక్కుమంటానని కలలుగన్నాడంట. కానీ వేలం రోజున.. అతని పేరు మీద ఎవరూ బెట్టింగ్ పెట్టలేదంట.. ఆర్సీబీతో సహా ఎవరూ తనను కొనుగోలు చేయలేదని తెలిపాడు.
దీంతో చాలా బాధపడ్డానని పాటిదార్ తెలిపాడు. దీంతో తన కెరియర్ ప్రశ్నార్థకమైపోయిందట. ఆ తర్వాత సాధారణ స్థాయి క్రికెట్ మ్యాచ్‌ల్లో మళ్లీ బాటపట్టానని.. అయితే మళ్లీ ఆర్‌సీబీ నుంచి ఫోన్ వచ్చిందని.. లవ్‌నిత్ సిసోడియా గాయపడ్డాడని… నువ్వే రీప్లేస్ ఉన్నారంట. ఆ సమయంలో తాను ఆ ఆహ్వానం తీసుకునేంత ఆసక్తిగా లేనని రజత్ తేల్చి చెప్పారు. ఇంజురీ రీప్లేస్‌మెంట్‌గా వస్తే ఎలెవన్‌లో స్థానం దొరకదని.. డగౌట్‌లో కూర్చోవడం కష్టంగా అనిపిస్తుందని తెలిపాడు. కానీ.. ఎప్పుడూ అవకాశాలు రెండోసారి తలుపుతడవు. అదృష్టవశాత్తూ నా కోసం తలుపు తట్టింది అని చెప్పాడు.
ఇప్పటికే కోహ్లీ, ఫాఫ్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్‌లతో నిండి ఉన్న జట్టుకు కెప్టెన్‌గా తన ఎంపికపై మొదట సందేహాలే ఎక్కువగా వచ్చాయంటాడు పాటిదార్. తనకు ఆ భారం మోపబోతున్నారా.. కోహ్లీ నాకింద ఆడతాడా.. అన్న ప్రశ్నలతోనే మొదలైందట. కానీ కోహ్లీ పూర్తిగా తన వెన్నుదన్నుగా నిలవడం, ప్రతి అంశంలో సహకరించడం అతన్ని ధైర్యవంతుడిని చేసిందని అన్నాడు. విరాట్ తనను ఎప్పుడూ ప్రోత్సహించారు. ఎలా నాయకత్వం వహించాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న దిశగా ఎన్నో సూచనలు ఇచ్చారు. ఓ బ్యాట్స్‌మన్‌గా కాదు.. కెప్టెన్‌గా తాను ఎదగడానికి ఇది బెస్ట్ ఛాన్స్” అని పాటిదార్ చెప్పుకొచ్చాడు.