Saturday, April 12, 2025
HomeఆటRajendranagar: అంతర్ కళాశాలల క్రీడలు పోటీలు

Rajendranagar: అంతర్ కళాశాలల క్రీడలు పోటీలు

అగ్రికల్చర్ యూనివర్సిటీ

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థుల అంతర్ కళాశాలల క్రీడలు, ఆటల పోటీలు రెండవ రోజు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలలో 11 కళాశాలకు చెందిన దాదాపు 450 మంది క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనబరుస్తున్నారు.

- Advertisement -

ఇందులో భాగంగా రెండవ రోజు వివిధ క్రీడలను నిర్వహించారు. ఫుట్ బాల్,వాలీబాల్ క్రీడలో అశ్వరావుపేట, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు, బాల్ బ్యాడ్మింటన్ లో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల, సంగారెడ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సెమీఫైనల్ కి చేరుకున్నారు.

బాలికల విభాగంలో వాలీబాల్ లో రాజేంద్రనగర్,టెన్నికాయిట్ లో జగిత్యాల, అశ్వరావుపేట, టేబుల్ టెన్నిస్ లో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థినులు సెమీఫైనల్ కి చేరుకున్నారు. ఈ క్రీడల్ని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి.నరేంద్ర రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News