గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది'(Peddi) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం విధితమే. ముఖ్యంగా ఇందులో చరణ్ ఆడిన ఫస్ట్ షాట్‌కు భారీ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పెద్ది షాట్‌ను వాడుతూ ఓ వీడియో చేసింది. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా తమ ఆటగాళ్లతో పెద్ది గ్లింప్స్ రీక్రియేట్ చేసింది. చివరల్లో సమీర్ రిజ్వా చేత ఫస్ట్ షాట్ ఆడించింది. యుద్ధానికి తాము రెడీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు.
‘నా పెద్ది ఫస్ట్ షాట్ మాసివ్‌గా రీ క్రియేట్ చేసిన ఢిల్లీ జట్టుకు ధన్యవాదాలు. ఈ రోజు మ్యాచ్‌కు ఆల్ ది బెస్ట్. సన్ రైజర్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.