R Ashwin: టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్తూ ప్రకటన విడుదల చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. తాజాగా ఐపీఎల్ (IPL) ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ‘‘ఇది ప్రత్యేకమైన రోజు. అంతేకాకుండా, ఒక ప్రత్యేకమైన ఆరంభం. ప్రతి ముగింపు.. ఇంకో కొత్తదానికి ఆరంభం. ఐపీఎల్‌తో నా సమయం ఈ రోజుతో ముగుస్తుంది. కానీ.. వివిధ లీగ్‌ల చుట్టూ ఆటను అన్వేషించే సమయం ఇవాళ్టితోనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌లో నాకు అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి ధన్యవాదాలు. నా ముందున్న వాటిని ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఎక్స్‌లో అశ్విన్ పోస్టు చేశాడు.
Read Also: MK Stalin: ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? స్టాలిన్ కు బీజేపీ సవాల్
ఇకపోతే, గత బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మధ్యలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అశ్విన్ అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇప్పుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశ్విన్.. ఇటీవల తనపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అశ్విన్ ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అశ్విన్.. టీమ్‌ఇండియా తరఫున 106 టెస్టులు ఆడి 537 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి. అశ్విన్‌కు ఈ ఫార్మాట్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ 124. అలాగే అతడు 116 వన్డే మ్యాచుల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. 65 టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2009లో సీఎస్కే తరఫున ఎంట్రీ ఇచ్చి 2010, 2011 లో ఆజట్టు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, సీఎస్కే తరఫునే 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రీఫీస్ గెలిచాడు.
Read Also: Modi: మోదీ డిగ్రీ వివాదం.. సీఐసీ ఆదేశాలపై హైకోర్టు స్టే
విదేశీ లీగుల్లో ఆడేందుకేనా..?
విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌తోపాటు ఐపీఎల్‌కూ వీడ్కోలు పలికినవారే విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి ఉంటుంది. బీబీఎల్, SA20లాంటి లీగ్‌ల్లో ఆడేందుకు.. అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


