Tuesday, June 24, 2025
HomeఆటRavindra Jadeja: రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా

Ravindra Jadeja: రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(Ravindra Jadeja)అరుదైన ఘ‌నత సాధించాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్ట్ ఆల్‌రౌండ‌ర్ ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో సుదీర్ఘ కాలం పాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న ఆల్‌రౌండర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 1,151 రోజులుగా జ‌డ్డూ ఈ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక టాప్-10 ఆటగాళ్ల జాబితాలో నలుగురు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉండటం విశేషం.

- Advertisement -

టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 ఆటగాళ్లు వీరే..

** రవీంద్ర జడేజా (భారత్) – 400 పాయింట్లు
** మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 327 పాయింట్లు
** మార్కో యన్సెన్ (దక్షిణాఫ్రికా) – 294 పాయింట్లు
** పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) – 271 పాయింట్లు
** షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 253 పాయింట్లు
** జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 249 పాయింట్లు
** జో రూట్ (ఇంగ్లాండ్) – 247 పాయింట్లు
** గస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్) – 240 పాయింట్లు
** బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 235 పాయింట్లు
** క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్) – 225 పాయింట్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News