Tuesday, April 15, 2025
HomeఆటRCB: రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం..!

RCB: రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసి ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

- Advertisement -

ఓపెనర్ యశస్వి జైస్వాల్ 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ 30, ధ్రువ్ జురేల్ 35 (నాటౌట్) రన్లతో మద్దతిచ్చారు. కెప్టెన్ శాంసన్ 15 పరుగుల వద్ద ఔటవగా, హిట్మెయర్ 9, నితీశ్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజ్లెవుడ్, కృనాల్ పాండ్యా తలా ఒకో వికెట్ తీశారు.

అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫిలిప్ సాల్ట్ 65 పరుగులతో దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లీ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దేవదత్త్ పడిక్కల్ 40 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు.

ఆర్సీబీ కేవలం 17.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి 175 పరుగులు చేసి గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కేవలం కుమార్ కార్తికేయ ఒక్క వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మరో ముందడుగు వేసింది, ఇక రాజస్థాన్ జట్టు మాత్రం ఈ ఓటమితో వెనక్కి వెళ్లింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News