Sunday, March 23, 2025
HomeఆటIPL 2025: కోహ్లీ, సాల్ట్ మెరుపులు.. KKR పై RCB గ్రాండ్ విక్టరీ..!

IPL 2025: కోహ్లీ, సాల్ట్ మెరుపులు.. KKR పై RCB గ్రాండ్ విక్టరీ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతంగా ప్రారంభించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టంతో ఛేదించింది. విరాట్ కోహ్లీ (59 నాటౌట్).. ఫిల్ సాల్ట్ (56) మెరుపు ఆరంభం ఇచ్చాడు. చివర్లో రజత్ పటిదార్ (34) బౌండరీల వర్షం కురిపించడంతో ఆర్సీబీ అలవోక విజయాన్ని సాధించింది.

- Advertisement -

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఫిల్ సాల్ట్, కోహ్లీలు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతికే బౌండరీ బాదాడు. వచ్చిన బౌలర్ ను వచ్చినట్లు ఉతికేసాడు. మిష్టరీ బౌలర్ వరుణ్ చక్రర్తి బౌలింగ్ లో కూడా ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ 8.3 ఓవర్లలోనే 95 పరుగులు జోడించింది. అర్ధ సెంచరీ అనంతరం సాల్ట్ అవుటయ్యాడు. కాసేపటికి కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన దేవ్ దత్ పడిక్కల్ (10) ప్రభావం చూపలేకపోయాడు. కెప్టెన్ రజత్ పటిదార్ ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. చివర్లో పటిదార్ అవుటైనా, కోహ్లీ ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.

అంతక ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (56) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునీల్ నరైన్ (44) మెరుపులు మెరిపించాడు. అయితే వీరిద్దరు మినహా మిగిలిన వారు ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా చివర్లో KKR తడబడింది. కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ కేకేఆర్ ను 200 మార్కును దాటకుండా చూసుకుంది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లతో మెరిశాడు. హేజల్ వుడ్ కు 2 వికెట్లు దక్కాయి. కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News