Tuesday, April 8, 2025
HomeఆటIPL 2025: హోరాహోరీ పోరులో ముంబైపై ఆర్సీబీ విజయం.. తిలక్, హార్దిక్ పోరాటం వృథా..!

IPL 2025: హోరాహోరీ పోరులో ముంబైపై ఆర్సీబీ విజయం.. తిలక్, హార్దిక్ పోరాటం వృథా..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ముంబై జట్టు చివరి వరకూ పోరాడినా, విజయం మాత్రం అందుకోలేకపోయింది.

- Advertisement -

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ (64 నాటౌట్), విరాట్ కోహ్లీ (67) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం జితేష్ శర్మ (40) చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముంబై బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీయగా.. విఘ్నేస్ ఒక వికెట్ తీశాడు.

ఇక 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ప్రారంభం ఆశించినంత గొప్పగా రాలేదు.. అయితే మధ్యలో తిలక్ వర్మ.. హార్దిక్ పాండ్యా జోడీ మెరుపులు మెరిపించింది. తిలక్ వర్మ 29 బంతుల్లో 59 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సులు) చేసి వాంఖడేను హోరెత్తించారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో.. మ్యాచ్ ముంబై చేతుల నుంచి జారిపోయింది.

ముంబై ఆటగాళ్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ (17), ర్యాన్ రిక్కల్‌టన్ (17) వేగంగా ఆడినా, ఎక్కువ సమయం క్రీజులో నిలువలేకపోయారు. మిడిలార్డర్‌లో విల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరుత్సాహపరిచారు. చివర్లో నమన్ ధిర్ (11) కొంత ఆశ కలిగించినా ఫలితం లేకుండా పోయింది. ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలింగ్‌లో క్రునాల్ పాండ్యా నాలుగు వికెట్లతో ముంబై బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. జోష్ హేజల్‌వుడ్, యష్ దయల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తమ స్థానం మరింత బలపర్చుకుంది. మ్యాచ్ ఓడినప్పటికీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా చూపించిన పోరాట స్పూర్తి అభిమానులను అలరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News