Monday, March 31, 2025
HomeఆటRCB vs CSK: 17 ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్‌లో ఆర్సీబీ విజయం..!

RCB vs CSK: 17 ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్‌లో ఆర్సీబీ విజయం..!

చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మళ్లీ విజయం సాధించింది. చివరిసారిగా 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై ఆర్సీబీ గెలిచింది. కానీ ఆ తర్వాత చెపాక్‌లో విజయం రాలేదు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 50 పరుగుల తేడాతో RCB గెలిచింది.

- Advertisement -

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. హేజల్ వుడ్ మూడు కీలక వికెట్లు పడగొట్టగా, యశ్ దయాల్, లియాం లివింగ్‌స్టోన్‌లు చెరో రెండు వికెట్లు తీసి సీఎస్కే బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. రచిన్ రవీంద్ర (41) మినహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు. చివర్లో మహేంద్ర సింగ్ ధోని (30) బౌండరీలు బాదినా అది జట్టుకు ఎంతో ప్రయోజనం కలిగించలేదు.

ఆరంభంలోనే ఆర్సీబీ బౌలర్లు చెన్నైపై పట్టు సాధించారు. రెండో ఓవర్లో హేజల్ వుడ్, రాహుల్ త్రిపాఠి (5) మరియు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0)ను పెవిలియన్ చేర్చాడు. దీపక్ హుడా (4) కూడా త్వరగా అవుట్ కావడంతో పవర్ ప్లే ముగిసేసరికి సీఎస్కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర, శివమ్ దూబే (19) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా విజయాన్ని కాపాడలేకపోయారు.

ఇంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ (51) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఫిల్ సాల్ట్ (32) వేగంగా ఆడాడు. విరాట్ కోహ్లీ (31) నెమ్మదిగా ఆడినప్పటికీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (22) భారీ షాట్లు ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మతీశ పతిరణ 2 వికెట్లు సాధించాడు. ఈ విజయం ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత చెన్నై చెపాక్ లో విజయం సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News