Tuesday, May 27, 2025
Homeఆటరిషబ్ పంత్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!

రిషబ్ పంత్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్..!

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ హీటు రాజుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో రాణించగా, మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లూ అదే ఊపును కొనసాగించారు. ఈ మ్యాచ్ లక్నోకు లీగ్ దశలో చివరిది కావడంతో పూర్తి స్థాయి దాడికి దిగారు.

- Advertisement -

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో.. మొదటి నుంచి విజృంభించారు. రిషబ్ పంత్ బాటింగ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. కేవలం 61 బంతుల్లో 118 పరుగులు బాదిన పంత్, ఆర్సీబీ బౌలర్లపై అటాక్‌కు మోత పెట్టాడు. అతడికి జోడీగా మిచెల్ మార్ష్ 37 బంతుల్లోనే 67 పరుగులు చేసి రన్‌ రేట్‌ను పరుగెత్తించాడు. చివర్లో నికోలస్ పూరన్ తక్కువ బంతుల్లో హిట్టింగ్ చేస్తూ స్కోరు బోర్డును ఇంకా ముందుకు నడిపించాడు.

నిర్ణీయ ఓవర్లు ముగిసే సమయానికి.. లక్నో జట్టు 227 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఈ జట్టును ఆర్సీబీ బౌలర్లు నిలువరించలేకపోయారు. తుషారా, భువనేశ్వర్ కుమార్, షెఫార్డ్ తలో వికెట్ తీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News