Wednesday, July 16, 2025
HomeఆటDelhi Premier League: డీపీఎల్‌‌లో పేరు నమోదు చేసుకున్న రిషభ్‌ పంత్‌

Delhi Premier League: డీపీఎల్‌‌లో పేరు నమోదు చేసుకున్న రిషభ్‌ పంత్‌

Rishabh panth: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ డీపీఎల్‌ (ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌) వేలంలోకి వచ్చాడు. ఈ నెల 6, 7 తేదీల్లో డీపీఎల్‌ రెండో ఎడిషన్‌కు సంబంధించిన వేలం నిర్వహించనున్నారు. దీంతో ఆక్షన్‌లో పంత్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈసారి జరిగే టోర్నీలో న్యూ ఔటర్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ పేరుతో రెండు కొత్త ఫ్రాంచైజీలు చేరడంతో.. ఫ్రాంచైజీల సంఖ్య ఎనిమిదికి చేరింది. గత ఎడిషన్‌లో దిగ్వేశ్‌ రాఠీ, ప్రియాంశ్‌ ఆర్య వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఐపీఎల్‌ స్టార్లయిన్‌ ఇషాంత్‌ శర్మ, ఆయుష్‌ బదోని, హర్షిత్‌ రాణా, హిమ్మత్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌, అనుజ్‌ రావత్‌ వేలంలో నిలిచారు.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/national-news/elis-scheme-khelo-bharat-policy-jobs-sports-india/

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా ఈ సీజన్‌ డీపీఎల్‌ వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వేలంలో ‘బీ’ కేటగిరీలో ఉన్నట్లు సమాచారం. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కుమారుడు ఆర్యవీర్‌ కోహ్లీ కూడా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ వేలంలో ఉంటాడని సమాచారం. విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్‌ కోహ్లీ మెళకువలు నేర్చుకుంటున్న విషయం తెలిసిందే.

కాగా, ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) అత్యధిక ధర పలికిన ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులను నిరుత్సాహపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్‌జీ) తరఫున చివరి మ్యాచ్‌ల్లో సెంచరీ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో విఫలమయ్యాడు. పంత్‌ను ఎల్ఎస్‌జీ రూ.27 కోట్లతో కొనుగోలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-government-given-good-news-for-all-new-ration-card-aspirants/

ఇటీవల లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ఇప్పుడు డీపీఎల్‌ వేలంలో అతను తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో రిషభ్ పంత్ ఎంత ధర పలుకుతాడోనని ఇటు అభిమానులు అటు ఆటగాళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ రెండు సెంచరీలతో రాణించినా టీమ్ ఇండియాకు ఓటమి తప్పలేదు. ఐదు వికేట్ల తేడాతో ఆతిథ్య జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ మీద రెండు సెంచరీలు చేయడంతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. భారత్ తరఫున తక్కువ కాలంలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. కాగా, రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భారత్ క్రికెటర్లు కసితో ఉన్నారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News