Monday, March 31, 2025
HomeఆటRishabh Pant injured: ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్

Rishabh Pant injured: ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్

క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ లోని సొంతూరు నుంచి ఢిల్లీకి కారులో వస్తుండగా రూర్కీ సమీపంలో నర్సన్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రిషభ్ కారు నుంచి దూకేశారు. ఆ వెంటనే కారు పూర్తిగా మంటలకు ఆహుతి అయింది. ప్రస్తుతం రిషభ్ ఫోటోలు వైరల్ గా మారాయి. డివైడర్ ను ఢీకొట్టినప్పుడు తాను డ్రైవ్ చేస్తున్న మెర్సిడెజ్ కారులో మంటలు చెలరేగి.. ఈ ప్రమాదం సంభివించినట్టు తెలుస్తోంది. రిషభ్ ఒంటిపై కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నాయి. 25 ఏళ్ల టీం ఇండియా స్టార్ క్రికెటర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈరోజు తెల్లవారుజామున 5:30గంటలకు ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఫోటోలు వైరల్ కావటంతో రిషభ్ ఫ్యాన్స్ కలత చెందారు. డ్రైవింగ్ చేస్తున్న తాను నిద్రమత్తులో జోగినట్టు రిషభ్ పంత్ స్వయంగా వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News