ఐపీఎల్-20225(IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) నియమితులయ్యాడు. ఈమేరకు కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా తెలిపారు. ఈ సందర్భంగా గొయోంకా మాట్లాడుతూ.. పంత్ ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు మాత్రమే కాదని.. అత్యుత్తమ ఆటగాడని కొనియాడారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ధోనీ, రోహిత్ శర్మను విజయవంతమైన కెప్టెన్లు అంటారని.. 10-12 ఏళ్ల తర్వాత పంత్ కూడా వారి సరసన చేరుతాడని చెప్పుకొచ్చారు.
కాగా గతేడాది నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు లక్నో జట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పంత్‌కు కెప్టెన్సీ అప్పగించేందుకే అంత మొత్తం వెచ్చించింది. అయితే వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగినా పంత్ వైపే యజమాన్యం మొగ్గుచూపింది.