Rishabh Pant Record: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత జట్టుకు వికెట్ కీపర్‌గా అతని బ్యాటింగ్, కీపింగ్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే పంత్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రెండు సెంచరీలు చేయడం విశేషం. హెడ్లింగ్ వేదికగా జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 118 రన్స్ చేశాడు. ఆ తర్వాత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 25, 65, 74, 9 రన్స్ చేశాడు. ఈ సిరీస్ మొత్తంలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 425 పరుగులు చేశాడు. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తర్వాత ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
రికార్డు కోసం వేట..
రిషభ్ పంత్ ఇప్పుడు 61 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. 1964లో భారత్ తరఫున ఆడిన బుధి కుందేరన్ 525 పరుగులు చేయగా.. పంత్ ప్రస్తుతం 425 పరుగుల వద్ద ఉన్నాడు. మరో 101 పరుగులు చేస్తే ఆ రికార్డును అందుకోనున్నాడు. అయితే ఇది ఓ వికెట్ కీపర్‌కు అరుదైన రికార్డు.
డెనిస్ లిండ్సే రికార్డే టార్గెట్
1966-67లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డెనిస్ లిండ్సే 606 రన్స్ చేశాడు. 60 ఏళ్లుగా ఆ రికార్డు ఇప్పటికీ అతని పేరునే ఉంది. అయితే ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ దాన్ని అధిగమనించే అవకాశం ఉంది. 182 రన్స్ చేస్తే.. లిండ్సే రికార్డును అందుకుంటాడు పంత్.
టెస్టు చరిత్రలో పంత్ చెరగని ముద్ర
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్ ఆట ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తుంది. టెస్టు క్రికెట్‌లో కొత్త స్టాండర్డ్‌లను సెట్ చేస్తున్నట్లైంది. వికెట్ కీపర్‌గా ఉన్న రిషభ్ పంత్ ఫిట్‌నెస్, బ్యాటింగ్ విధానాన్ని ప్రశంసించాల్సిందే.


