స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స విజయంతంగా జరిగిందని వైద్యులు ప్రకటించారు. ఇండియన్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 25 ఏళ్ల రిషభ్ కు ప్రస్తుతం నీ లిగమెంట్ సర్జరీ పూర్తైంది. కొద్ది రోజులపాటు రిషభ్ ను అబ్జర్వేషన్లోనే కొనసాగనుండగా త్వరలో ఆయన్ను విదేశాలకు తీసుకెళ్లి అవసరమైన ఇతర చికిత్సలు అందించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ వెల్లడించింది. గాయపడ్డ పంత్ ను డెహ్రాడూన్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబై తరలించారు.