ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ శర్మ వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయాడు. భారత క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 02.30 గంటలకు ప్రారంభమవుతోంది. టీమిండియా గెలవాలని భారత క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ విషెస్‌ను తెలుపుతున్నారు.
ఈ ఏడాదిలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజిలాండ్ జట్టు ఈ టోర్నీలో చూసిన ఏకైక ఓటమి భారత్ తరపునే కావడం విశేషం. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో భారత్‌పై కివీస్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరగనుంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.