Saturday, February 22, 2025
HomeఆటMisses Hat Trick: అయ్యో ఎంత పనిచేశావు రోహిత్.. అక్షర్ కి హ్యాట్రిక్ మిస్..!

Misses Hat Trick: అయ్యో ఎంత పనిచేశావు రోహిత్.. అక్షర్ కి హ్యాట్రిక్ మిస్..!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. బంగ్లాతో ఆడుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. అయితే రోహిత్ శర్మ చేసిన తప్పుకు అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయ్యాడు. ఈ మ్యాచ్ లో తొమ్మిది ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ సర్కార్, కెప్టెన్ శాంటో, రహీమ్ డకౌట్ అయ్యారు. హసన్ మిరాజ్ ఐదు పరుగులు చేయగా.. టాంజిద్ 25 పరుగులు చేశాడు.

- Advertisement -

ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ ఓవర్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. రెండో బంతికి తంజిద్ హసన్‌ను ఔట్ చేసిన అక్షర్.. ఆ తర్వాత మూడో బంతికి ముష్ఫికర్ రహీమ్‌ను ఔట్ చేశాడు. ఆ ఇద్దరూ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.

https://twitter.com/SSpotlight71/status/1892512111881797844

అయితే నాలుగో బంతికి జాకీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను.. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన ఆ క్యాచ్‌ను అతను అందుకోలేకపోయాడు. దీంతో అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది. అయితే క్యాచ్ మిస్ అయిన తర్వాత రోహిత్ శర్మ చాలా ఫీల్ అయ్యాడు. మంచి రికార్డ్ తన కారణంగా పోయిందని బాధపడుతూ బాపుకి క్షమాపణ చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నది. ఆ జట్టు టాప్ ఆర్డర్ పెద్దగా స్కోర్ చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News