Saturday, November 15, 2025
HomeఆటRohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. అత్యధిక రన్స్‌ చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా...

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. అత్యధిక రన్స్‌ చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు..!

Rohit Sharma Record Century in India Australia One Day Match: శనివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయిన రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా నిలిచారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించారు. రోహిత్‌ 15,787 రన్స్‌ చేయగా గత రికార్డులను బద్దలు కొట్టారు. సెహ్వాగ్‌ (15,758) పరుగులతో రెండో స్థానం, సచిన్‌ను 15,335 పరుగులతో మూడో స్థానాలకు పరిమితమయ్యారు. శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ(100 పరుగులు నౌటౌట్, 105 బంతుల్లో 11×4 2×6)తో తనదైన ఇన్నింగ్స్ లో చెలరేగాడు. రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కానీ మూడో వన్డేలో ఆసీస్ బౌలర్లకు ఆ చాన్స్ ఇవ్వలేదు. మొదట్నుంచీ ఆచితూచి ఆడుతూ, చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు.

- Advertisement -

సిరీస్‌లో తొలి సెంచరీ.. వన్డేల్లో 33వ శతకం..

ఆస్టేలియా స్టార్ స్పిన్నర్ ఆడం జంపా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్ చివరి బంతికి సింగిల్ చేసి రోహిత్ శర్మ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సిరీస్ లో తొలి సెంచరీ కాగా, వన్డే కెరీర్ లో హిట్ మ్యాన్ కిది 33వ శతకం. సెంచరీ చేసిన రోహిత్ ను మాజీ కెప్టెన్, సహచరుడు విరాట్ కోహ్లీ అభినందించాడు. సెంచరీ చేసే క్రమంలో రెండో వికెట్ కు కోహ్లీతో కలిసి 19వ సారి వన్డేల్లో శతక భాగస్వాయ్యం నెలకొల్పాడు రోహిత్. కాగా, టెస్టుల్లో 12, టీ20 ఇంటర్నేషనల్‌లో 5 సెంచరీలు చేసిన రోహిత్ వన్డేల్లో 33 శతకాలు బాదేశాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 50 సెంచరీలు పూర్తి చేసుకుని అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ వన్డే, టీ20, టెస్టుల్లో ప్రతి ఫార్మాట్‌లలో 5 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మెన్‌ రోహిత్ అని తెలిసిందే.

ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు..

రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాలో వన్డేలో ఇది ఆరో సెంచరీ. దీంతో పాటు హిట్‌మ్యాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ 33వ ఇన్నింగ్స్‌లో ఇది ఆరో సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కొహ్లీ ఆస్ట్రేలియాలో 32 వన్డే ఇన్నింగ్స్‌లలో మొత్తం 5 సెంచరీలు చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కూడా ఆస్ట్రేలియాలో 5 సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో ఈ జాబితాలో రోహిత్ నెంబర్ వన్ అయ్యాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad