Rohit Sharma| టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య రితికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా రోహిత్ సతీమణి రితిక కుమారుడి పేరును అధికారికగా ప్రకటించారు. నాలుగు క్రిస్మస్ బొమ్మలపై తమ పేర్లతో పాటు చిన్నారి పేరు కూడా రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. తమ కుమారుడికి ‘అహాన్ శర్మ’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. దీంతో చిన్ని రోహిత్ పేరు భలే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా రోహిత్-రితికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అయిన మూడు సంవత్సరాలకు 2018 డిసెంబర్ 30న కుమార్తె జన్మించింది. ఆమెకు సమైరా అనే పేరు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. అయితే కుమార్తె, కుమారుడు ఇద్దరు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలోనే పుట్టడం విశేషం. కొడుకు పుట్టడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.