Saturday, November 15, 2025
HomeఆటRohit Sharma: రో-కో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్లు వచ్చేస్తున్నారోచ్..!

Rohit Sharma: రో-కో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్లు వచ్చేస్తున్నారోచ్..!

Rohit Sharma: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరలోనే బరిలో దిగనున్నారు. టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పిన వీరిద్దరూ త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఏతో వన్డే సిరీస్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఇదే నెలలో వీరిని ఫీల్డ్ లో చూడొచ్చు. ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌ను.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా వాడుకోవాలని ఈ స్టార్ ప్లేయర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్, టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో వారు స్టేడియంలో కనిపించడం తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడిన వీరు.. కెరీర్ ముగింప దశకు వచ్చారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే లక్ష్యంతో భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సిద్దం అవుతున్నారు.

- Advertisement -

Read Also: Trump: వెనుజువెలా హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు..!

అక్టోబర్-19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా..

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అర్హత సాధించేందుకు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాస్ కూడా అయ్యారు. అయితే రోహిత్, కోహ్లీలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందే.. ఫీల్డ్ లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఈ స్టార్లు ఇద్దరూ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడాలంటే దేశవాళీ మ్యాచ్ లు ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అందుకే, ఈ మ్యాచులు ఆడుతున్నట్లు తెలుస్తోంది.కీలకమైన సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఏతో ఆడి ఫామ్, ఫిట్‌నెస్ సాధించాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

Read Also: BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. అకౌంట్లో రూ.20 వేల కోట్లు..!

ఆస్ట్రేలియా-ఏ తో..

ఆస్ట్రేలియా-ఏతో.. ఇండియా-ఏ మూడు వన్డేలు ఆడనుంది. ఇవి అనధికారిక వన్డే మ్యాచ్‌లు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 తేదీల్లో ఈ వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసమైనా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఆడే అవకాశం ఉంది. ఇక రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగాలంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రాణించడం కీలకం. దీంతో ఈ సిరీస్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

ఆస్ట్రేలియా- భారత్ వన్డే సిరీస్ షెడ్యూల్..

  • తొలి వన్డే: అక్టోబర్ 19 – పెర్త్ స్టేడియం
  • రెండో వన్డే: అక్టోబర్ 23 – అడిలైడ్ ఓవల్
  • మూడో వన్డే: అక్టోబర్ 25 – సిడ్నీ క్రికెట్ స్టేడియం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad