Saturday, November 15, 2025
HomeఆటRohit Sharma: ఆస్పత్రిలో కనిపించిన రోహిత్‌ శర్మ.. ఆందోళనలో ఫ్యాన్స్​!

Rohit Sharma: ఆస్పత్రిలో కనిపించిన రోహిత్‌ శర్మ.. ఆందోళనలో ఫ్యాన్స్​!

Rohit Sharma Visit Kokilaben Hospital: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ సోమవారం రాత్రి ముంబయిలో గల ప్రముఖ ఆసుపత్రి అయిన కోకిలాబెన్‌ హాస్పిటల్‌లో కనిపించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. రోహిత్‌ శర్మ ఎందుకు ఆసుపత్రికి వెళ్లారన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే సోషల్‌ మీడియాలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా రోహిత్​ కోరుకోవాలని కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

ఇటీవల రోహిత్‌ శర్మ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ టెస్ట్‌ విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టేందుకే ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మే లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్‌ శర్మ.. తన 67 టెస్ట్‌ల కెరీర్‌లో 4,301 పరుగులతోపాటుగా 12 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో తన బెస్ట్‌ స్కోరు 212 పరుగులు కావడం విశేషం.

పెర్త్‌ స్టేడియంలో కనిపించనున్న రోహిత్: 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని గెలిచిన తర్వాత నుంచి రోహిత్‌ శర్మ విరాట్‌ కోహ్లీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి దూరంగా ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే టి20లకు సైతం రిటైర్‌ అయ్యారు. వీరిద్దరూ ఇకపై పూర్తిగా వన్డే ఫార్మాట్‌పైనే ఫోకస్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ఎదురుచూస్తున్న రోహిత్‌-విరాట్‌ల కంబినేషన్‌ అక్టోబర్‌ 19న ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కనిపించనుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి మ్యాచ్‌ అక్టోబర్‌ 19న పెర్త్‌లోని ఆప్టస్‌ స్టేడియంలో జరగనుంది.

టెస్ట్‌, టీ20లకు రిటైర్‌ అయినా అన్ని కోట్లా..?: ప్రస్తుతం స్టార్‌ బ్యాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ BCCI A+ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లోనే ఉన్నారు. ఈ కేటగిరీ కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాది ఫీజుగా రూ. 7 కోట్లు వస్తుంది. అదనంగా ఒక్కో టెస్ట్‌ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు పొందుతారు. వన్డే మ్యాచ్‌కు అయితే రూ. 6 లక్షలు అలాగే టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు పొందుతారు. ఇవేకాకుండా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న రోహిత్‌ శర్మకు సీజన్‌కు రూ. 16 కోట్ల రెమ్యూనరేషన్‌ వస్తోంది. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు నడిపిన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు. అన్ని కలిపి రోహిత్‌ శర్మకు ఏడాదికి సుమారు రూ. 50 కోట్లకుపైగానే ఆదాయం వస్తుందని అంచనా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad