Sunday, July 7, 2024
HomeఆటRoja: ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు

Roja: ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు

ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో శాప్ మరియు క్రీడా శాఖా అధికారులతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. PYKKA ఫండ్స్ ద్వారా ప్లే గ్రౌండ్స్ నీ ఆధునీకరించనున్నట్టు రోజా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరుకు కేంద్ర క్రీడా శాఖా మంత్రిని కలసి.. మన రాష్ట్రానికి నిధుల సమీకరించనున్నామని మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు.
నేషనల్ గేమ్స్ కోసం సన్నాహక ఏర్పాట్ల పై మంత్రి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియ చేయడం, వారి నైపుణ్యాలను పెంపొందించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పన కు అధిక ప్రాధాన్యత జగనన్న ప్రభుత్వము ఇస్తుందని ఆమె అన్నారు.
ఈ సమావేశంలో భాగంగా ఏర్పాటు, వాటి నిర్వహణ పై మంత్రి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, టోర్నమెంట్ ల నిర్వహణ అత్యంత శ్రద్ధతో నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడకారుడికి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం మా జగనన్న లక్ష్యం అని అన్నారు. ఈ సమీక్షలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ ఐఏఎస్, శాప్ ఎండీ హర్ష వర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News