PBKS vs RCB IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఆరోసారి ఓటమి తప్పలేదు. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. ఆర్సీబీ విసిరిన 223 పరుగుల లక్ష్యాన్ని.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఛేదించలేకపోయింది. భారీ బౌండరీల ప్రయత్నంలో శశాంక్ చివరి వరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. దీంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల టేబుల్‌లో మొదటి స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
Also Read: https://teluguprabha.net/sports-news/cti-chairmans-letter-to-organize-ipl-season-without-spectators/
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. మైదానంలో పరుగుల వరద సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్), విరాట్ కోహ్లీ (58) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఓపెనర్ జాకబ్ బెతెల్ (11) త్వరగానే పెవిలియన్ చేరినా.. విరాట్ కోహ్లీ 58(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ 45(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తమదైన స్టైల్‌లో అద్భుత ఆరంభాన్ని అందించారు. కోహ్లీ, పడిక్కల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ 73(40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు నాటౌట్) పరుగుల వరద పారించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) తన వంతు సహకారం అందించాడు. దీంతో పంజాబ్ ఎదుట ఆర్సీబీ 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.
Also Read: https://teluguprabha.net/telangana/actor-manchu-manoj-started-trust/
భారీ లక్ష్య ఛేదనకి దిగిన పంజాబ్ కింగ్స్‌కి పవర్ ప్లేలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల పటిష్ఠమైన బౌలింగ్‌కి 3 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టు ఒత్తిడిలో పడింది. కూపర్ కనోలీ(33) బౌండరీలతో తన వంతు పోరాటం చేశాడు. మార్కస్ స్టోయినిస్(37), సూర్యాంశ్ షెగ్డే(35), శశాంక్ సింగ్(56) లక్ష్య ఛేదనలో తీవ్రంగా ప్రయత్నించినా బెంగళూరు బౌలర్ల ధాటికి పెవిలియన్ చేరక తప్పలేదు. దీంతో ఇన్నింగ్స్ ముగిసేనాటికి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, భువనేశ్వర్ కుమార్ 2, హాజిల్ వుడ్, సుయాశ్ శర్మ, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.

