GT vs RCB IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్- 1 పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డామినేటెడ్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గుజరాత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని 254 భారీ పరుగులను సాధించడమే కాదు.. ఇటు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చెమటలు పట్టించారు. ఏకంగా 92 పరుగులతో ఘన విజయం సాధించారు. ఆర్సీబీ ఆల్‌రౌండర్ పర్ఫామెన్స్‌తో ఫైనల్స్ బెర్తు ఖాయం చేసుకోగా.. ఇటు గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్- 2లోకి చేరింది.
Also Read: https://teluguprabha.net/telangana/professor-nageshwar-meets-dgp-cv-anand/
ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా, రజత్ పాటిదార్ సేన బ్యాటింగ్‌కి దిగింది. ఆర్సీబీ ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించడంతో పవర్‌ప్లేలో మంచి స్కోరు చేయగలిగారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్(7 బంతుల్లో 19), విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 43), దేవదత్ పడిక్కల్(19 బంతుల్లో 30) పరుగులతో మంచి ఆరంభాన్ని అందించారు. వీరు ఔటయ్యాక.. క్రీజులోకి వచ్చిన రజత్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కృషి చేశాడు. సెంచరీకి చేరువలో నాటౌట్‌గా నిలిచి ఎవర్‌గ్రీన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఈ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
చివరి 5 ఓవర్లలోనే ఆర్సీబీ 110కి పైగా పరుగులు చేసిందంటే బ్యాటర్లు ఏవిధంగా చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 43), జితేశ్ శర్మ(15 నాటౌట్) తోడ్పాటు అందించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 2 వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: https://teluguprabha.net/news/youth-dies-after-falling-from-tsunami-swing-at-rajgir-fair-in-bihar/
255 భారీ పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కి పవర్ ప్లేలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. పవర్ ప్లేలో ఏకంగా 5 వికెట్లు కోల్పోవడంతో జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. వరుసగా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మ్యాచ్ అప్పటికే చేజారిపోయింది. క్రీజులో నిలదొక్కుకున్న సాయి సుదర్శన్(14), జాస్ బట్లర్(29) ఆర్బీబీ బౌలర్ల ధాటికి పెవిలియన్ బాట పడ్డారు. అటు పరుగుల కట్టడిలో బెంగళూరు విజయం సాధించింది. జాసన్ హోల్డర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ తెవాతియా(68) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా మిగతా బ్యాటర్లందరూ నిరాశపరిచారు. దీంతో ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ 3, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం, కృనాల్ పాండ్యా తలో 2 వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్‌కి ఒక వికెట్ దక్కింది.

