HomeTop StoriesIPL 2026: డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌దే ట్రోఫీ.. టైటిల్‌ పోరులో ఆర్సీబీ ఘన విజయం 

IPL 2026: డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌దే ట్రోఫీ.. టైటిల్‌ పోరులో ఆర్సీబీ ఘన విజయం 

RCB vs GT IPL FINAL 2026: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌- 2026) ట్రోఫీని వరుసగా రెండోసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన టైటిల్‌ పోరులో ఘన విజయం సాధించి మరోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. అద్భుతమైన పర్ఫామెన్స్‌తో సీజన్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన రజత్‌ సేన.. అదే దూకుడును కొనసాగిస్తూ ఫైనల్‌లో కప్‌ను ఎగరేసుకుపోయింది. 

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/telangana/ktr-comments-on-cm-revanth-reddy-about-rythu-discom/

ఐపీఎల్‌- 2026 సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌ల నుంచీ ఆకట్టుకునే ప్రదర్శనతో టాప్‌-4లో కొనసాగుతూ వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌.. క్వాలిఫైయర్స్‌లోనూ అద్భుతంగా ఆడింది. కానీ ఫైనల్‌ పోరులో బ్యాటింగ్‌లో తడబడి తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా చేధించింది. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ipl 2026 final

తొలుత టాస్‌ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ పవర్‌ ప్లేలోనే వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. దీంతో అధిక స్కోరు కోసం బౌండరీలు చేసే క్రమంలో బెంగళూరు ఫీల్డర్లకి చిక్కి వరుసగా పెవిలియన్‌ చేరారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్‌ సుందర్‌(50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్‌(12), శుభమన్‌ గిల్‌(10), నిశాంత్‌ సింధు(20) నిరాశపరిచారు. జాస్‌ బట్లర్‌(19), అర్షద్‌ ఖాన్‌(15) పరుగులు చేశారు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు సైతం చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్‌ సలామ్‌ 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌ తలో 2 వికెట్లు, కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌ తీశాడు. 

ALOS READ: https://teluguprabha.net/telangana/minister-tummala-comments-on-maize-purchase/

156 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ఆర్సీబీ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను సునాయసంగా ఛేదించింది. వెంకటేశ్‌ అయ్యర్‌32(16బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) పవర్‌ ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. స్టార్ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ 75(42బంతుల్లో 9ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(15), టిమ్‌ డేవిడ్‌(24) పరుగులతో ఫర్వాలేదనిపించారు. దీంతో ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేశారు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, సిరాజ్‌, రబాడ, అర్షద్‌ ఖాన్‌కి తలో వికెట్‌ దక్కింది.   

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News