దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ విరాళాల ప్లాట్‌ఫామ్ అయిన ‘గివ్ ఇండియా’తో కలిసి అమెజాన్ తమ రన్ ఫర్ చేంజ్ ను విజయవంతంగా ముగించిందని అమెజాన్ ఇన్ ద కమ్యూనిటీ (ఇండియా ఏపిఏసి) హెడ్ అనిత కుమారన్ వెల్లడించారు. ఇండియా రన్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ 5 కి.మీ పరుగును భారతీయ మోడల్, ఫిట్‌నెస్ ప్రేమికుడు మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 3000 మందికి పైగా అమెజోనియన్లు, వారి కుటుంబ సభ్యులు విద్య, హరిత గ్రహం కోసం తమ మద్దతును అందించడానికి ఈ రన్‌లో పాల్గొన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడంతో ఉజ్వల భవిష్యత్తును సృష్టించాలనే తమ మిషన్‌లో భాగంగా అమెజాన్ ‘గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటీరింగ్’లో భాగంగా ‘రన్ ఫర్ చేంజ్’ నిర్వహించబడింది. నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా, ప్రతి 2.5 కి.మీ దూరం కవరేజికి, ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి స్కూల్ కిట్‌ను అమెజాన్ విరాళంగా ఇస్తుందన్నారు. ఈ బహుళజాతి సంస్థ ప్రతి 1 కి.మీ కవరేజికి ఒక చెట్టును నాటుతుందన్నారు. అదనంగా,రిజిస్ట్రేషన్ రుసుము నుండి వచ్చే తోడ్పాటుకు,మూడు రెట్లు అధికంగా అమెజాన్ జోడించి, దానిని స్వచ్ఛంద సంస్థ గివ్ ఇండియాకు విరాళంగా అందిస్తుందని తెలిపారు.