Saturday, April 19, 2025
HomeఆటSai Kaushik: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతక విజేత సాయి కౌశిక్

Sai Kaushik: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతక విజేత సాయి కౌశిక్

అభినందనల వెల్లువ

కజకిస్థాన్ దేశంలో నిర్వహించిన అండర్ 19ఏషియన్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన ఊట్ల సాయి కౌశిక్ బంగారు పథకాన్ని సాధించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ క్రీడాకారుడు సాయికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

జగదీశ్వర్ గౌడ్ క్రీడాకారుడికి అభినందిస్తూ మన దేశానికి బంగారు పతకం సాధించడం చాలా గర్వకారణమని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రపంచ పోటీలో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహకారం అందజేయడానికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News