మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో రెండవ నార్త్ ఈస్ట్ రేగట్ట – 2023 సెయిలింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల కు చెందిన క్రీడాకారులు సంజయ్ రెడ్డి – గోల్డ్ మెడల్ తో పాటు 50 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ మనీ, R. అశ్వినీ – కాంస్య పతకం సాధించి 25 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ సాదించిన సంధర్బంగా SATS చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా ప్రాధికార సంస్థ కు చెందిన స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు సేలింగ్ క్రీడలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూరన్నారు. సెయిలింగ్ క్రీడ హైదరాబాదు నగరానికే పరిమితం కాకుండా అన్ని జిల్లాలలో విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో మహబూబ్ నగర్ లో జాతీయస్థాయి సెయిలింగ్ ఛాంపియన్షిప్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను చాటాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడ పాఠశాల OSD డాక్టర్ హరికృష్ణ, మహబూబ్ నగర్ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు గోపాల్ యాదవ్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.